ఆరోగ్యానికి అశ్వగంధ
ఆయుర్వేదంలో అనేక మూలికలు ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. వాటికి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేద మందులతో వేలాది వ్యాధులు నయమయ్యాయి. అలాంటి దివ్యమైన ఔషధ మూలికల్లో అశ్వగంధ కూడా ఒక శక్తివంతమైన ఔషధం.
గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్, నరాల బలహీనత, ఆర్థరైటిస్ వంటి లెక్కలేనన్ని వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధను తరచూ వాడుతూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కార్టిస్టాల్‌ను రెగ్యులేట్ చేయడం, స్ట్రెస్ హార్మోన్‌ను రిలీజ్ చేయడంలో అశ్వగంధ ఎంతో దోహదం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.
అశ్వగంధ వల్ల ఇన్‌ఫ్లమేషన్ నుంచి పోరాడే శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అశ్వగంధ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ మెరుగవుతుంది. అశ్వగంధను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల మంచి నిద్ర కలుగుతుంది. హార్మోన్ల రెగ్యులేట్ చేయడం, ఫెర్టిలిటీ వంటి సమస్యలు అశ్వగంధ వాడటం వల్ల తగ్గుతాయి.
అశ్వగంధ శరీరానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు. కండరాల బలహీనత, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది.






