2 April, 2026 | 3:20 AM

ఏసీబీ వలలో ఏఎస్సై

02-04-2026 01:26 AM
  1. కేసు మూసివేయిస్తానని లంచం డిమాండ్ 
  2. ఎల్బీనగర్ కోర్టులో ప్రాంగణంలో పట్టపడిన ఏఎస్సై

ఎల్బీనగర్, ఏప్రిల్ 1 : మహిళ వేధింపు కేసు మూసి వేయిస్తానని లంచం డిమాండ్ చేసిన ఏఎస్త్స్ర కోర్టు ప్రాంగణాలోనే ఏసీబీకి చిక్కాడు. మల్కాజిగిరి కమిషనరేట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్త్స్ర బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్త్స్ర బాలయ్య కోర్టు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 363/ 2025లో పల్లపు రాంబాబుపై మహిళ వేధింపుల కేసు నమోదైంది.

ఈ కేసులో ఇరుపక్షాలు రాజీ పడ్డారు. కాగా, కాంప్రమైజ్ అయిన కేసును రంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అ దాలత్‌లో మూసి వేయిస్తానని ఏఎస్సై బాలయ్య రూ.15 వేల లం చం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పల్లపు రాంబా బు ఏసీబీ అధికారు లను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, అధికారులు ముందస్తుగా ట్రాప్ ఏర్పాటు చేసి కోర్టు ప్రాంగణంలోనే బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.