ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా
గౌహతి: 126 స్థానాలు కలిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం నాడు కొనసాగుతుండగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జలుక్‌బారి నియోజకవర్గం నుండి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శర్మ, పోలింగ్ కేంద్రం నంబర్ 15 వద్ద తన ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి రినకి భూయాన్ శర్మ, పిల్లలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రంలో వరుసగా మూడవసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు, సీఎం శర్మ తన సతీమణి రినికి భూయాన్ శర్మతో కలిసి గువహటిలోని కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దాదాపు 25 ఏళ్లుగా జలుక్‌బారి నియోజకవర్గం హిమంత బిశ్వ శర్మకు కంచుకోటగా కొనసాగుతోంది.




