21 July, 2026 | 10:56 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అస్సాం సీఎం

21-07-2026 12:14 AM

బొగ్గు, గనుల అంశాలపై చర్చ

హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అసోం రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు, గనుల రంగం అభివృద్ధి, ఇతర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, కొత్త గనుల ఎక్స్‌ప్లోరేషన్, వనరుల సద్వినియోగం, గనుల రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు.

అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలు, ఎదురవుతున్న సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకురాగా, వాటిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల సహకారంతో బొగ్గు, గనుల రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.