21 July, 2026 | 11:23 AM

మైనారిటీ కాలేజ్ తరలింపుపై ప్రజావాణిలో ఫిర్యాదు

21-07-2026 12:16 AM

ఎల్లారెడ్డి జులై 20, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలం లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మైనారిటీ వెల్ఫేర్ కళాశాలను గత కొన్ని రోజుల క్రితం లింగంపేటకు తరలించడంపై ఎల్లారెడ్డి లోని అఖిలపక్ష రైతులతో పాటు ముస్లింల సంక్షేమ సంఘ సభ్యులు ఆర్డిఓ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందించారు  సోమవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఆర్డీవో  కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మైనార్టీ జూనియర్ కళాశాలను అకస్మాత్తుగా లింగంపేటకు తరలించడం సరికాదని వారన్నారు.

కేవలం కళాశాల భవనం శిథిలావస్థలో ఉన్నదని సాకుతో లింగంపేటకు తరలించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు కానీ కళాశాల భవనం ఇప్పటివరకు ఎలాంటి శిథిలావస్థకు లేదని ఇంకా ఐదు సంవత్సరాల వరకు భవనాన్ని వినియోగించుకోవచ్చు అని నిపుణులు చెప్పారని వారన్నారు ప్రస్తుతం ప్రైవేటు భవనాన్ని ఎంచుకున్నారని తెలిసిందని ఆ భవనం అన్ని వసతులతో నిర్మించడం కోసం కాస్త సమయం పడుతుందని సమాచారం అందిందన్నారు.

  ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాలను ఎల్లారెడ్డి నుంచి తరలించే ప్రసక్తి లేదని అలా కాని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో తరలింపు నిర్ణయాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో బారాస పట్టణ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ మదర్సా నిర్వహ అధ్యక్షులు ఎజాజ్ మసూద్ భాజపా రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్ ఎంఐఎం పట్టణ అధ్యక్షులు రజాక్ డి.ఎస్.పి నాయకుడు సాయిలుతో పాటు మైనార్టీ నాయకులు ఇమ్రాన్ బర్కత్ యూనిస్ అమీర్ అజముల్లా ఖాన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.