calender_icon.png 1 February, 2026 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధినిర్వహణలో ఉద్యోగులపై దాడులు చేయడం హేయమైన చర్య

26-10-2024 05:14:53 PM

మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్యోగుల నిరసన

హుజూర్ నగర్ (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం నందు మేనేజర్ సమక్షంలో కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పొగాకు విశ్వేశ్వర్ అకారణంగా వార్డు ఆఫీసర్ అయిన మామిండ్ల జయరాములు వివాదంలో ఉన్న ఫైల్ మీద సంతకం పెట్టమని ఒత్తిడి చేయడంతో దానికి జయ రాములు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైల్ మీద సంతకం చేయనని చెప్పగా అతను వార్డు ఆఫీసర్ ను మేనేజర్ సమక్షంలో కొట్టడం జరిగింది.

ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో వివారణ చేపించి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, వార్డు ఆఫీసర్ జయరామకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం హుజూర్ నగర్ మున్సిపల్ కార్యలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వార్డ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షలు మూరగుండ్ల సైదులు, మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులైన అజయ్ సుధారాణి, లక్ష్మీ మధుబాబు, శేఖర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, నారాయణ, వీరమణి, కౌసల్య, అలివేలు, స్నేవాలత, శివకుమారి, అన్నపూర్ణ, చద్రకళ, సలీం, రవి వెంకటనరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.