21 April, 2026 | 10:23 PM

మూడు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

18-12-2024 01:33 AM

స్పోర్ట్స్ వర్సిటీ, యూనివర్సిటీ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణల బిల్లులు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ మూడో రోజూ నిరసనలకు, గందరగోళానికి వేదికగా నిలిచింది. మంగళవారం బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య మూడు కీలక బిల్లులు.. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీ అమెండ్‌మెంట్ బిల్లు, తెలంగాణ జీఎస్టీ అమెండ్‌మెంట్ బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది.

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. దీనితో ఎలాంటి చర్చ జరుగకుండానే బిల్లును ఆమోదించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ, తెలంగాణ యూనివర్సిటీ అమెండ్‌మెంట్ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ జీఎస్టీ అమెండ్‌మెంట్ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టారు.