calender_icon.png 26 November, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ బిల్లులను విడుదల చేయాలి

11-02-2025 01:40:50 AM

  • లేదంటే మార్చి నుంచి పనులు బంద్ చేస్తాం
  • జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హెచ్చరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబం ధించిన బిల్లులను విడుదల చేయాలని, లేదంటే మార్చి నుంచి గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులను నిలిపివేస్తామని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకు లు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకుడు సాయి కిరణ్ మాట్లా డుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి కౌంటిం గ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపర్చే దాకా 272 మంది కాంట్రాక్టర్లు ఏర్పా ట్లు చేశారన్నారు. మొత్తం రూ.27.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

చెల్లింపుల కోసం ఆర్వో నుంచి కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రా ష్ట్ర ఎన్నికల కమిషన్, మంత్రులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సహా రాష్ట్రపతికి కూడా విన్నవించామన్నారు. మొత్తం ఎన్నికల ఏ ర్పాట్లలో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం నుంచి టెండర్ ద్వారా పను లు చేపట్టిన కాంట్రాక్టర్లకు తప్పా.. మిగతా ఆర్వో తదితర ఉన్నతాధికారులు బినామీలు అందరికీ బిల్లులు చెల్లించారని విమర్శించారు.

రాష్ట్రపతి నుంచి ఆదేశాలు అందిన తర్వాత హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాలలో కేవలం మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే బిల్లులు చెల్లించి మిగతా వారికి చెల్లింపులు చేయకుండా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్‌బీనగర్‌లో అక్కడి ఆర్వో తమకు అనుకూలమైన వ్యక్తికి బిల్లులు చెల్లించి మిగతావారికి చెల్లించలేదన్నారు.

ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నెలలో బిల్లులు చెల్లించకుంటే మార్చి నుంచి గ్రేటర్ వ్యాప్తంగా అన్ని రకాల పనులు బంద్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కాంట్రాక్టర్లు రామకృ ష్ణారెడ్డి జీ సాయికిరణ్, పీ శ్రీశైలం, ఎస్ భాస్కర్‌రావు, వసంత్‌కుమార్ పాల్గొన్నారు.