18 August, 2026 | 12:28 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మన్ మృతి

20-04-2026 12:00 AM

విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదం

కోహెడ, ఏప్రిల్ 19: కోహెడ మండలం నారాయణపూర్ గ్రామంలో అసిస్టెంట్ లైన్మెన్ భూక్య సురేష్ (40) కరెంట్ షాట్ తో మృతి చెందారు. ఎస్‌ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వ్యవసాయ బావుల దగ్గర కరెంటు వైర్లు కిందికి ఉండడంతో వ్యవసాయ రైతులు లైన్మెన్ కు కరెంట్ వైర్లు పైకి లేపాలని కోరారు. 

కరెంటు వైర్లు పైకి పునరుద్దరణ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాట్ తో మృతి చెందారు. రెండు ఫీడర్ల నుండి కరెంటు సప్లై అవ్వడంతో ప్రమాదం జరిగింది. మృతుని భార్య పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.