9 July, 2026 | 12:25 PM

ఈ డిటెక్టివ్ మేరీ హత్య కేసును ఛేదించాడా?

17-12-2024 12:00 AM

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. మేరీ అనే యువతి హత్యోదంతం, వరుస హత్యల కలకలం, డిటెక్టివ్ రంగంలోకి దిగి ప్రేమజంటను, ఏడుగురు అనుమానితులను గుర్తించడం వంటి అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ, సినిమాపై అంచనాలను పెంచింది.