calender_icon.png 21 January, 2026 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో అతివలకే పెద్దపీట

21-01-2026 12:53:08 AM

రెండు చైర్ పర్సన్ పదవులు 

48 కౌన్సిలర్ పదవులు 

మహబూబాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అతివలకే పెద్ద పీట దక్కింది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉండగా కేసముద్రం, మరిపెడ ము న్సిపాలిటీ చైర్ పర్సన్ పదవులు మహిళలకు కేటాయించారు. మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా, కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి ఎస్టీ మహిళకు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో మొత్తం 98 వార్డు కౌన్సిలర్ పదవులు ఉండగా అందులో 48 వార్డు కౌన్సిల్ పదవులను మహిళలకు కేటాయించారు.

మహ బూబాబాద్ మున్సిపాలిటీలో పురుషుల ఓట్లు 31,550 ఉండగా, మహిళల ఓట్లు 34, 121 ఉన్నాయి. ఇక తొర్రూర్ లో పురుషులు 10,501, 10,942 మహిళలు, కేసముద్రం లో పురుషులు 7,754, మహిళలు 8,191, మరిపెడలో 6,709, మహిళలు 6,978 ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంలో మహిళల పాత్ర కీలకంగా మారింది. 48 వార్డులతోపాటు రెండు చైర్ పర్సన్ పదవులను మహిళలకు కేటాయించారు. దీనితో చైర్ పర్సన్ పదవులకు, వార్డు కౌన్సిలర్ పదవులకు అభ్యర్థుల ఎంపిక ప్రారంభించారు. 

ఎన్నికల జోరు పెంచిన అధికార కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకం కావడంతో మహిళా ఓటర్లను ప్రస న్నం చేసుకోవడానికి, ఎన్నికల ఏర్పాట్లకు అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే జోరు పెం చింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మ హిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ తో పాటు, వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీలు అందించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. అటు మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తిచేసిన పనులను ప్రారంభించడానికి ఎమ్మెల్యే లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో పాలకుర్తి ఎమ్మె ల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తూ, ఇందిరమ్మ చీరలను అందజేస్తున్నారు.

మానుకోట జిల్లా కేంద్రంలోని మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటికే మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చే యించగా, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ నేతృత్వంలో నియోజకవర్గ పరిధిలోని కేసముద్రం మున్సిపాలిటీలో కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. ఇక ఇదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఆధ్వర్యంలో వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్ర మాలకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు.

అలాగే మహిళలకు ఇందిరమ్మ చీరల పం పిణీ, బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయిస్తున్నారు. అధికార పార్టీ పూర్తిగా మహిళా ఓట్లపై అత్యధిక శ్రద్ధ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మహిళలకు గృహ జ్యోతి పథకం ద్వారా గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ తదితర పథకాలను అమలు చేస్తుండగా, తాజాగా బ్యాంకు లింకేజీ రుణా లు, వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.