ఎ.టి.ఎం. ను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.టి.ఎం.ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం బ్యాంక్ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తాతో ఎ.టి.ఎం.ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఎ.టి.ఎం. ఉద్యోగులకు, అధికారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, జిల్లా కలెక్టరేట్ కు వచ్చే వారికి, ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ విజయ్ భాస్కర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, బ్యాంకు మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.






