కుస్లీ ప్రాంతంలో చిరుత సంచారం
10-12-2024 06:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలోని కుస్లీ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి చిరుత అటవీ ప్రాంతంలో సంచరిస్తూ సోమవారం మేకల ముందు నుంచి పోయిన మేకను దాడి చేసి తిన్నట్టు రైతు సాయినాథ్ తెలిపారు. మంగళవారం అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు అలేఖ్య సాయి రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి చనిపోయిన మేక పిల్లలకు శివపంచాయమ్మ నిర్వహించారు. పులి ఆనవాలపై గుర్తులు సేకరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






