నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ
తిరుమలాయపాలెం, జూలై 5 (విజయ క్రాంతి) : తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన సీపీఐ మండల కార్యదర్శి బత్తుల రాధాకృష్ణ మేనల్లుడు వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ నూతన వధూవరులను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో దీర్ఘకాలం కలిసి జీవించాలని ఆకాంక్షించారు.
పరస్పర ప్రేమాభిమానాలు, అన్యోన్యత, పరస్పర అవగాహనతో వారి దాంపత్య జీవితం ఆదర్శప్రాయంగా కొనసాగాలని కోరారు. కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, వధూవరుల జీవితంలో ప్రతి అడుగులో విజయాలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల రవికుమార్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.






