19-01-2026 09:59:52 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): అరేవు అలైవ్ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ నుండి చినూరు గ్రామానికి వెళ్లే ప్రధాన క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం పోలీస్ వారు ఐదు భారీ గేట్లను జిగ్- జగు విధానంలో ఏర్పాటు చేసి వాహనాలు నెమ్మదిగా నడపాలని చర్యలు తీసుకున్నారు. వేగంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించి అలాంటి ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు తీవ్రంగా బాధలు అనుభవిస్తున్న విషయాన్ని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ అవగాహన కల్పించారు. అలాగే వాహనాలను నిర్ణయించిన పరిమితికి మించి వేగంగా నడపకూడదని రోడ్డు భద్రత నియమాలు తప్పకుండ పాటించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై భార్గవ్ గౌడ్,పోలీస్ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.