10 April, 2026 | 2:11 AM

ప్రైవేట్ పాఠశాలలో దారుణం

10-04-2026 12:28 AM

విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు

తంగళ్ళపల్లి ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామంలోని క్రాసింగ్ ఉన్న విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు చితకబాదిన. ఉపాధ్యాయురాలు. విద్యార్థి శరీరంపై దద్దులు వచ్చేలా కట్టెతో విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు.. హోంవర్క్ నీటుగా చేయలేదు అనే కారణంతో విద్యార్థి సోఫి యా పై దాడి.పాఠశాలల్లో ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థులు ముఖ్యంగా బాలికలు శా రీరక దాడులకు అక్కడక్కడ గురవుతున్న ఘ టనలు ఆందోళన కలిగిస్తున్న ఉపాధ్యాయులు తీరు మార్చుకోకపోగా మళ్లీ,మళ్లీ దాడి ఘటనలు పునరావృతం అవ్వడం చాలా బాధాకరం.

కాగా ఈ పాఠశాల నిర్వాహకులు ఫీజుల విషయంలో కూడా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ బయట ఎండలో నిలబెడుతున్నారనే ఆరోపణలు తల్లిదండ్రుల నుండి వెలువెత్తుతున్నాయి..ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేసి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు,విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు.