16 May, 2026 | 2:09 AM

గుర్తు తెలియని జంతువు దాడి

16-05-2026 12:00 AM

17 మేకలు మృతి 

గజ్వేల్, మే15: గుర్తుతెలియని అడవి జంతువు దాడిలో 17 మేకలు మృత్యువాత పడిన సంఘటన వర్గల్ మండలం సీతారాం పల్లి తండాలో చోటుచేసుకుంది. బాధితుడు నరేందర్ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మేకలను పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రోజు మాదిరిగానే తనకున్న మేకలను కాసుకోవడానికి మేకల మంద దగ్గరికి వెళ్లి చూడగా 17 మేకలు మృత్యువాత పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మేకలను గుర్తుతెలియని అడవి జంతు దాడి చేసి చంపాయని, దీనివల్ల తన కుటుంబం రోడ్డున పడిందని ప్రభుత్వం ఆదుకొని సహాయం చేయాలని కోరుతున్నాడు.