16 May, 2026 | 2:12 AM

రైతుల కోసం రోడ్డెక్కిన మార్కెట్ కమిటీ చైర్మన్

16-05-2026 12:00 AM

చేగుంట, మే 15: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం రోడ్డు ఎక్కిన చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, తాసిల్దార్ శివప్రసాద్, ఏపిఎం దుర్గాప్రసాద్, రవాణా శాఖ అధికారులు పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో చేగుంట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు నేరుగా రోడ్డెక్కారు.

ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు మాట్లాడుతూ మండలంలో రైతులకు కష్టాలు చూసి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్ తరలించడమే లక్ష్యంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పక్రియ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శివప్రసాద్, ఏపిఎం దుర్గాప్రసాద్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, సినియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.