28 June, 2026 | 10:52 AM

గంజాయి మత్తులో యువకుల దాడి

17-10-2025 02:56 PM

ఏఐవైఎఫ్ నేతలకు గాయాలు....                 

ఉప్పల్, విజయక్రాంతి: నగర శివారు మల్లాపూర్ లో  రోజురోజుకు  గంజాయి మహమ్మారి విజృంభిస్తుంది నిత్యం మల్లాపూర్ బాబా నగర్(Mallapur Baba Nagar)  చాణిక్య పూర్ కాలనీ  బెల్ కంపెనీ సమీపంలో  గంజాయి సేవించి అసభ్యకరంగా వ్యవహరించడంతోపాటు  దాడులకు సైతం పాల్పడుతున్నారు. నిత్యం గుంపులు గుంపులుగా గంజాయి  సేవిస్తూ వాహనదారులను ఇబ్బంది గురి చేస్తున్నారు. తాజాగా  మల్లాపూర్ డివిజన్ మాణిక్చంద్ వద్ద  గంజాయి సేవించిన యువకులు ద్విచక్ర వాహనం ను  ఇష్టాను సారంగా నడుపుతూ  ప్రశ్నించిన అఖిల భారత యువజన సమాఖ్య  ఉపాధ్యక్షుడు గిరిబాబు సురేష్ లపై  రాళ్లతో దాడి చేశారు.

రోడ్లపై ఇష్టానుసారంగా  ద్విచక్ర వాహనం నడపడమే కాకుండా ప్రమాదాలు జరిగే విధంగా  నిర్లక్ష్యంగా ఎందుకు నడుపుతున్నారని  ప్రశ్నించేందుకే దాడి చేశారని వారు తెలిపారు. గంజాయి సేవించే యువకులు  అసలేం చేస్తున్నారు అసలు ఏమి చేస్తున్నారు  అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని ప్రశ్నించినందుకే దాడి  చేశారని వారు వాపోయారు దీనికి సంబంధించి నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు   బెల్ చౌరస్తా నుండి  శక్తి సాయి నగర్ వరకు  గంజాయి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని  స్థానికులు వాపోతున్నారు.  ఇప్పటికైనా పోలీసు అధికారులు  గంజాయి సేవించి ప్రజలను ఇబ్బందిల కు గురి చేస్తున్న వారిపై పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు..

గంజాయి సేవించి వారిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్రగంజాయి సేవించి వాహనదారులను ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై  చర్యలు తీసుకోవాలని ఏవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్రన్నారు మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి సత్య ప్రసాద్ అన్నారు. గంజాయి సేవించి  ఏవైఎఫ్ఐ నాయకులు పై దాడి దిగిన వారిపై   కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు  మారక ద్రవ్యాల కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ నేతలపై దాడిని వాళ్లు ఖండించారు. దాడి చేసినవారిని  వెంటనే అరెస్ట్ చేసి  ఎన్టీపీస్ చట్ట కింద కేసు నమోదు చేయాలని వాళ్ళు డిమాండ్