21 July, 2026 | 12:34 PM

ఎస్‌ఐఆర్‌తో ప్రజాస్వామ్యంపై దాడి

21-07-2026 01:31 AM
  1. 2029 ఎన్నికలే లక్ష్యం గా బిజెపి ఎస్‌ఐఆర్ ప్రయోగం
  2. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు 

చౌటుప్పల్ , జూలై 20 : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)ను ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రక్రియగా కాకుండా, రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వినియోగించుకుంటోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆరోపించారు .అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించే రాజకీయ ప్రయత్నాల కోసం ఎస్ ఐ ఆర్ నీ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

సీపీఐ(ఎం ) ఆధ్వర్యంలో చౌటుప్పల్లోని పద్మావతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న రాఘవులు ఎస్‌ఐఆ్ప విస్తృతంగా మాట్లాడుతూప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియేనని, అయితే గతంలో జరిగినప్పుడు ఇంత తీవ్ర రాజకీయ చర్చలు, ప్రజల్లో ఆందోళనలు కనిపించలేదని రాఘవులు అన్నారు.

అలాగే జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో బి ఎల్ ఓ, బి ఎల్ ఎ లుగా విధులు నిర్వహిస్తున్న వారికి సరైన శిక్షణను ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని పరిశీలించి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని , వలస కార్మికులు గ్రామాలలో లేరని నేటికి అనేక వేల మంది దరఖాస్తు పారాలను పూర్తి చేసి ఇవ్వలేదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం డి పాష , సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య ,కొండమడుగు నరసింహ ,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.