24 April, 2026 | 5:05 PM

మేకల కాపరులపై దాడితో దుశ్చర్లపై ప్రతి దాడి

24-04-2026 03:43 PM

- సూర్యాపేట జిల్లా మోతె మండలంలో ఆయన పెంచిన అడవిలో ఘటన

- ముగ్గురికి గాయాలు

- సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స

మోతె: మేకల కాపరులపై దాడి చేసినందుకు జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణపై ప్రతిదాడికి దిగిన ఘటన మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ లోని ఆయన పెంచిన అటవీలో గురువారం జరిగింది. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బయ్యా లింగయ్య, కృష్ణయ్యలు తమ పొలంలో మేకలు, గొర్రెలను మేపేందుకు తోలుకెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో వారి ఇరువురి భూమిని ఆనుకొని దుశ్చర్ల సత్యనారాయణ అటవి ఉండడంతో కొన్ని మేకలు అందులోకి వెళ్లి మేశాయన్నారు.

అధి గమనించిన సత్యనారాయణ వారిరువురిని దుర్భాషలాడుతూ కర్రతో వారిపై దాడి చేశాడన్నారు. ఈ దాడిలో బయ్య లింగయ్య ఎడమ కాలి మోచిప్ప పగిలిపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న లింగయ్య కుమారులు గంగయ్య, మల్లయ్యలు సత్యనారాయణపై ప్రతిదాడి చేశారన్నారు. ఈ దాడిలో దుశ్చర్ల సత్యనారాయణ తలకు గాయమైందన్నారు. కాగా గాయాలపాలైన లింగయ్య, కృష్ణయ్యలతో పాటు సత్యనారాయణలను సూర్యాపేటలోని ఏరియా దవఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.