తాండూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు బస్తాలు తరుగు విషయంలో కూడా చర్చించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
ఎండలు ఎక్కువగా ఉన్నందున రైతులు జాగ్రత్త పడాలి అన్నారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలు రైతుల ఖాతాలో డబ్బులు రావడం జరుగుతుందని పూర్తి చివరి గింజల వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని బయట దళారులకు ధాన్యాన్ని అమ్ముకొని మోసపోవద్దని ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు అక్కంపల్లి గ్రామాల సర్పంచులు యాద గౌడ్, వెంకా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్,సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వాసు రెడ్డి, గడ్డం బాల్రెడ్డి, ప్రభాకర్, సంజీవులు, వేముల సంగయ్య, మాదాస్ అంజయ్య, చింటూ, బోరంచ సాయిలు,దివిటీ కిష్టయ్య,ఉప సర్పంచ్ అభిషేక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






