19-05-2025 09:55:16 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గోదావరి రోడ్డులో పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు అకస్మిక దాడి చేశారు. ఎస్సై సురేష్(SI Suresh) తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రహస్య సమాచారం మేరకు గోదావరి రోడ్డులో గల పేకాట స్థావరంపై దాడి చేయగా ఈ దాడిలో 7 గురు పేకాటరాయుళ్లను పట్టుకొని వారివద్ద నుండి రూ.2720/- తో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు. నిందితుల వివరాలిలా ఉన్నాయి. ఎంబడి వెంకటేష్, చిట్టుమల్ల రాకేష్, అబ్దుల్, జాఫర్, బుద్దే రాయమల్లు, సాజిద్, గౌస్, గోయికారి వినోద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎస్సైతో పాటు పోలీసు బృందం పాల్గొన్నారు.