19-05-2025 09:15:29 PM
ఖమ్మం (విజయక్రాంతి): ఆన్ లైన్ బెట్టింగ్ కి అలవాటు పడి, ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి వద్ద కేర్ టేకర్ గా ఉద్యోగంలో చేరి, అతనికే తెలియకుండా అతని అకౌంట్ నుండి సుమారు రూ 11.49 లక్షలు బెట్టింగ్ కు పాల్పడిన వ్యక్తిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు(Khammam Cyber Crime Police) సోమవారం అరెస్టు చేసినట్లు సి.పి. సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని, నిదానపురం గ్రామానికి చెందిన 20 సంరాల గుండా వెంకటేశ్వర రెడ్డి అనే యువకుడు ఖమ్మంలోని ఖమ్మం హోమ్ కేర్ సర్వీస్ లో కేర్ టేకర్గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతనికి గత నాలుగైదు సం. నుండి ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడే వాడు. ఇందులో భాగంగా గత మార్చిలో ఇతను ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి అయిన గాదె కేశవరావు దగ్గర కేర్ టేకర్గా ఉద్యోగంలో చేరాడు. నేరస్థుడు అయిన వెంకటేశ్వర్ రెడ్డి ఆన్ లైన్ బెట్టింగ్కి వ్యసనపరుడై అతని యజమాని దగ్గర కేర్ టేకర్గా ఉంటూనే, అతనికి తెలియకుండా అతని ఫొన్ లోని గూగుల్ ఫే ద్వారా బెట్టింగ్ ఆప్ లలోకి డబ్బులు డిపాజిట్ చేసి, బెట్టింగ్ కు పాల్పడేవాడు. ఈ విధంగా మార్చిలో సుమారు రెండువారాలు వరుసగా సుమారు రూ 11.49 లక్షల డిపాజిట్ చేసి, ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడు.
ఎవరికి అనుమానం రాకుండా గూగుల్ ఫే హిస్టరిని, జి మేల్ హిస్టరిని డెలీట్ చేశాడు. సదరు యజమాని కేశవరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా నేరస్థుడుని గుర్తించి, విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడుని ఖమ్మం సైబర్ క్రైం కోర్ట్ లో హజరు పరిచినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డిఎస్పీ ఫణిందర్ ని, ఎస్పైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సిపి అభినందించారు.