calender_icon.png 4 February, 2026 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి దుండగుడి దాడి

04-02-2026 01:36:05 AM

బాధితుడి నుంచి సెల్‌ఫోన్, నగదు లాక్కునేందుకు యత్నం

తీవ్ర గాయాలతో ధైర్యంగా ప్రతిఘటించిన ఇమ్రాన్ 

చిట్యాల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): లిఫ్ట్ అడిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్న వ్యక్తిపై దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరిన ఇమ్రాన్ అనే వ్యక్తినిమార్గమధ్యలో నార్కెట్‌పల్లి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో సరేనని అతన్ని కారులో ఎక్కించుకున్నాడు.

అయితే చిట్యాల సమీపానికి చేరుకోగానే ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఇమ్రాన్‌పై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్, నగదు అపహరించేందుకు దుండగుడు యత్నించాడు. అయితే తీవ్ర గాయాల మధ్య కూడా ఇమ్రాన్ ధైర్యంగా ప్రతిఘటించడంతో, భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇమ్రాన్‌ను గమనించిన స్థాని కులు స్పందించి 108 అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.  నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.