14 July, 2026 | 4:34 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

అప్పు చెల్లించమని అడిగినందుకు బ్లేడుతో దాడి

14-05-2024 09:02 PM

యువకుడికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్ : అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు బ్లేడుతో దాడికి పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌లోని అశోక్‌కాలనీకి చెందిన మహ్మద్ అహ్మద్ ఖాన్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో తన స్నేహితులైన ఖలీమ్, సయ్యద్, జాహిద్‌లతో కలిసి అమీర్‌పేట ప్రాంతానికి టీ తాగేందుకు వెళ్లి, తిరిగి వస్తున్న క్రమంలో బీకేగూడ వద్ద కూరగాయల మార్కెట్‌లో నిమ్మకాయల వ్యాపారం చేసే అమీన్(38)ను కలిశారు. అహ్మద్ ఖాన్ మిత్రుడైన ఖలీమ్ వద్ద గతంలో అమీన్ రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఎప్పుడు చెల్లిస్తావని అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం అహ్మద్ ఖాన్, ఖలీమ్‌లు ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో కోపంతో అమీన్ పక్కనే ఉన్న బ్లేడ్‌తో అహ్మద్ ఖాన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన అహ్మద్ ఖాన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.