4 July, 2026 | 1:07 AM

ఇసుక దందాపై దాడులు

05-10-2024 01:13 AM

బోట్లు, టిప్పర్లు స్వాధీనం 

ఆదిలాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో అ క్రమ ఇసుక దందాపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో ని జైనథ్, బేలా మండలాల్లోని పెన్ నది పరివాహక ప్రాంతాల్లో కొంద రు ఇసుక అక్రమ దందాను యథేచ్ఛగా చేపట్టడంతో అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు.

శుక్రవారం బేలా మండలంలోని కామ్‌గార్‌పూ ర్ గ్రామంలోని పెన్‌గంగా నది నుంచి ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో మైనింగ్ శాఖ ఏడీ రవీందర్, తహసీల్దార్ రఘునాథ్, ఏఎస్‌ఐ జీవన్‌కుమార్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నది వద్ద ఉన్న మూడు పడవలు, ఆయిల్ ఇంజన్‌లను, రెండు టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు, మూడు జేసీబీలతోపాటు 12 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకునట్లు తహసీల్దార్ రఘునాథ్ తెలిపారు.