4 July, 2026 | 1:02 AM

వీబీ జీ రామ్ జీ పథకానికి గ్రీన్ సిగ్నల్

04-07-2026 12:22 AM

నోటిఫికేషన్ జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): గ్రామీణ ఉపాధి అవకాశాలను మరింత విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకాన్ని అధికారికంగా నోటిఫై చేసింది. ఈ నెల 1 నుంచే గ్రామీణ ప్రాంతా ల్లో పథకం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం అమలుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తెలంగాణకు రూ. 3,825.31 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రభుత్వం తన 40 శాతం వాటాగా రూ.2,550.21 కోట్లు సమకూర్చనున్నది.

ఇప్పటివరకు అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 100 పని దినాలు మాత్రమే అందుబాటులో ఉండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా 124 పనిదినాలు కల్పించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతా ల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పేద కుటుంబాలకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం అమలుతో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమివ్వడంతోపాటు ఉపాధి హామీ పనుల్లో మరింత పారదర్శకత, సమర్థత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.