4 July, 2026 | 1:06 AM

పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయండి

04-07-2026 12:28 AM
  1.    20 వేల పోస్టులకు నోటిఫికేషన్  జారీ చేయాల్సిందే
  2. నిరుద్యోగుల ఆశలను వమ్ము  చేయొద్దు     
  3. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవా రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

పోలీసు శాఖలో 20వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 5వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారిలో ఎక్కు వగా పేద, మధ్యతరగతి కుటుంబాల వారేనన్నారు. వారంతా హైదరాబాద్‌కు వచ్చి హాస ళ్లలో ఉంటూ రేయింబవళ్లు కష్టపడి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని, వారి ఆశలపై నీళ్లు చల్లవద్దన్నారు.

నీళ్లు, నిధులు, ని యామకాలు.. తెలంగాణ ఉద్యమ నినాదమని, పోస్టులు పెంచాలని  పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు పోరాడుతున్నా, కేవలం 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో 17 వేలకు పైగా ఖాళీ ఉన్నాయని ఆర్టీఐ ద్వారా బహిర్గతమైందన్నారు. అంతేకాదు.. 12 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని స్వయంగా మీరే ప్రకటించి, వా టిని భర్తీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 

ఇలాంటి నేపథ్యం లో కేవలం 5 వేల పోస్టులకు ప్రకటన జారీ చేసి దాదాపు 15 లక్షల మంది పోలీసు ఉ ద్యోగ అభ్యర్థులను నైరాశ్యంలోకి నెట్టే ప్రయ త్నం చేస్తుందన్నారు. దిల్‌సుఖ్‌నగర్ లాంటి ప్రాంతాల్లో నిరుద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో మూడు దఫాలు వేసిన నో టిఫికేషన్ల ద్వారా 47 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు.

మొత్తంగా బీఆర్‌ఎస్ హయాంలో 2 లక్షల 32 వేల ఉద్యోగాలను నోటిఫై చేయడమే కాకుండా, ఒక లక్ష 60వేల ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు లాభం చేకూరేలా 95 శాతం లోకల్ రిజర్వేషన్ కూడా సాధించామన్నారు.

పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడి నాలుగేళ్లు గడుస్తున్నందున, అభ్యర్థుల వ యోపరిమితిని సడలించాలని కేటీఆర్ కోరా రు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని కానిస్టేబుల్ 36, ఎస్‌ఐ ఉద్యోగాలకు 37 ఏళ్లకు పెంచాలన్నారు.  ప్రస్తుతం జీవో నంబర్ 87 ప్రకారం ఎస్‌ఐకి 35, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 32 ఏళ్ల వయో పరిమితి ఉందన్నారు.  

‘యూత్ డిక్లరేషన్’ను మరిచారా?

‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీ లు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని,  నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల  భృతి ఇస్తాం’ అని హామీ ఇచ్చింది.. వాటన్నింటినీ తుంగలో తొక్కిందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. 

రెండున్నర  ఏళ్లలో కేవలం 17 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని, పైగా బీఆర్‌ఎస్  హయాంలో భర్తీ చేసిన 50 వేల పైచిలుకు ఉద్యోగాలకు ని యామక పత్రాలు అందించిందని ఎద్దేవా  బీఆర్‌ఎస్  తర ఫున పోరాటానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.