9 June, 2026 | 1:13 AM

ఘనంగా దుర్గాభవాని బోనాలు, ఉత్సవాలు

09-06-2026 12:00 AM

 అమ్మవారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

చేగుంట, జూన్ 8 : చేగుంట మండల చందాయపెట్ గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా భవాని అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయం తరలివచ్చి బోనాల సమర్పించారు, అమ్మవార్లకు ఆకర్షణమైన బోనాలు శివసత్తున పూనకాలు పోతరాజుల విన్యాసులతో బోనాలను అమ్మవారికి సమర్పించారు, దీంతో శ్రీ దుర్గా భవాని అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు, ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు, దుర్గ భవాని  ఆలయానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు, దీంతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది, ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు జరగకుండా చేగుంట ఎస్త్స్ర చైతన్యకుమార్ రెడ్డి, ఎస్ ఐ 2, బిక్య నాయక్ బందోబస్తు ఏర్పాటు చేశారు.