12 July, 2026 | 4:47 AM

ఆలయ భూమి ఆక్రమించేందుకు యత్నం

10-06-2024 01:40 AM

అడ్డుకున్న గ్రామస్తులు

మంథని, జూన్ 9 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలోని మల్లికార్జునస్వామి ఆలయానికి చెంది న భూమి ఆక్రమించుకునేందుకు ఆదివారం కొందరు యత్నిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. గ్రా మస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలోని తొమ్మిదెకరాల భూమిని దాతలు ఆలయ పోషణకు ఇవ్వగా ఇద్దరు వ్యక్తులు ఆక్రమించారు. ఆదివారం సదరు భూమిని చదును చేయిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయ భూమిపైనా కన్ను వేసి, రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించేందకు ప్రయత్నిస్తున్నారని, కలెక్టర్, మంత్రి శ్రీధర్‌బాబు భూమిని అక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.