గుడి చెరువులో మురుగు కలవనివ్వం
10-06-2024 01:39 AM
ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జూన్ 9(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న గుడి చెరువు, మూలవాగులో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం వేములవాడలో గంగ పుత్ర సంఘం ఆధర్యంలో నిరహించిన గంగాభవాని బోనాల మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలతో సకాలంలో వరాలు పడి, చెరువులు నిండి ప్రజాలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. చుక్క మురుగు నీరు కూడా గుడి చెరువులోకి, మూల వాగులోకి చేరకుం డా ప్రభుతం తరలోనే పనులను ప్రారంభిస్తుందని చెప్పారు.






