25 May, 2026 | 10:51 PM

జమిలీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం

14-12-2024 12:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు 

ఖమ్మం, డిసెంబర్ 13 (విజయక్రాంతి): జమిలీ ఎన్నికలు జరపాలని నిర్ణయించడం దేశ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జమిలీ ఎన్నికల వల్ల లాభాల కంటే  నష్టాలే ఎక్కువ ఉన్నాయన్నారు. బీజేపీ  అధికార కాంక్షతోనే జమిలీ ఎన్నికల అంశం తెరమీదకు తీసుకొచ్చిందన్నారు. శుక్రవారం ఖమ్మంలో రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం కారణంగా నిరంకుశత్వం పెరిగి నియంత పాలనకు  దారి తీసే అవకాశం ఉందని అన్నా రు. రాష్ట్రాల హక్కులకు కూడా భం గం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలను సీపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరా డాలన్నారు. పార్టీ శతజయం తి ప్రారంభ సభ ఈ నెల 30న నల్లగొండలో జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురే శ్,  మౌలానా, పాల్గొన్నారు.