12-12-2025 09:38:06 AM
మత్తు పదార్థం ఇచ్చి విద్యార్థులను చితక బాధిన గుర్తు తెలియని వ్యక్తులు
విద్యార్థులను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించిన అద్యాపకులు
మునిపల్లి (విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలకు ఇద్దరి విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు యత్నించి మత్తు పదార్థం ఇచ్చి చితకి బాధిన సంఘటన లింగంపల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సొంబంధించి పాఠశాల అద్యాపకులు, స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి గురుకుల పాఠశాలకు చెందిన 6వ తరగతి చదువుతున్న సిద్దు, రాకేష్ అనే విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉన్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి గ్రామ సమీపంలో గల ఉర్దు మీడియం పాఠశాల వెనుకాలకు తీసుకెళ్లి మత్తు పదార్థం ఇచ్చి చితకబాదారు. దీంతో చుట్టు పక్కల వారు గమనించి పాఠశాల అద్యాపకులకు సమాచారం అందించడంతో వెంటనే విద్యార్థులను జహీరాబాద్ ఏరియాసుపత్రికి తరలించగా మత్తు పదార్థం ఇవ్వడంతో అది ఫోరెన్సీ ల్యాబ్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యుల సూచన మేరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని ప్రిన్సిపాల్ సురభి చైతన్య తెలిపారు.