calender_icon.png 29 July, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ పబ్లిక్ స్కూల్లో అటెండర్ అనుమానాస్పద మృతి

29-07-2025 12:00:00 AM

వరంగల్ క్రైమ్, జులై 28 (విజయ క్రాంతి): హనుమకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో సోమవారం అటెండర్ పోలెపాక శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందారు. బట్టుపల్లి గ్రామానికి చెందిన పూలెపాక శ్రీనివాస్ పది సంవత్సరాల నుండి అటెండర్ గా వరంగల్ పబ్లిక్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్నారు. అనుమా నాస్ప దంగా పాఠశాలలో పోలేపాక శ్రీనివాస్ మృతదేహం లభించడంతో విద్యార్థులు పాఠశాల యాజమాన్యనీకి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగి స్తున్నారు. విలేకరులను పాఠశాల లోపటికి పంపిం చకుండా పోలీసులు, యాజమాన్యం అడ్డుకోవడం కొసమెరుపు. ఏది ఏమైన ప్పటికీ మృతిని కుటుంబ సభ్యులకు సమా చారం అందజేసి మంతనాలు జరుపు తున్నట్లు సమాచారం. మృతునికి ఒక కొడుకు, ఇద్దరూ కూతుళ్లు, భార్య ఉన్నట్లు సమాచారం.