calender_icon.png 30 July, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లైఓవర్‌పై కుంగిన రోడ్డు

29-07-2025 12:00:00 AM

  1. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో ఘటన
  2. ఇటీవలే రైల్వే బ్రిడ్జిపై ఫ్లుఓవర్ నిర్మాణం

రామకృష్ణాపూర్, జూలై 28: మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతన్‌పల్లి రైల్వే బ్రిడ్జిపై ఇటీవల నిర్మించిన ఫ్లైఓవర్‌పై వేసిన రోడ్డు సోమవారం రాత్రి కుంగిపోయింది. రామకృష్ణాపూర్ పట్టణం నుంచి మంచిర్యాల వైపునకు వెళ్లే దారిలో బ్రిడ్జిపై రోడ్డు కుంగిపోవడంతో పాటు ఫుట్‌పాత్‌పై పగుళ్లు ఏర్పడ్డాయి.

రాత్రిపూట రోడ్డు కుంగడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం, అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.