calender_icon.png 29 July, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడిసిన్ కోసం వెళ్లిన వివాహిత అదృశ్యం

28-07-2025 11:52:29 PM

మేడిపల్లి: మెడిసిన్ కోసం వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ శంకర్ యాదవ్, భార్య సంజు దేవి యాదవ్ వయసు(25) తో కలిసి శ్రీ శ్రీ నగర్ హుడా పార్కు దగ్గర నివాసం ఉంటున్నారు. తేదీ 27 రోజున సాయంత్రం మెడిసిన్ తీసుకువస్తానని ఇంటి నుండి వెళ్లి మరల ఇంటికి తిరిగి రాలేదు. భర్త  మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భర్త శ్రీ శంకర్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.