ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశ్రమ సందర్శన
ఘట్ కేసర్ (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్శిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం థర్డ్ ఇయర్ విద్యార్థులు శనివారం పాశమైలారంలోని కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను సందర్శించారు. మెకానికల్ విభాగంలోని తర్మెక్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ సందర్శనలో సేఫ్టీ ఆఫీసర్ ఎస్.వి.డి. విజయ్ కుమార్, ఇంజనీర్ మహేష్ లు విద్యార్థులకు వివిధ భవన నిర్మాణ విడిభాగాల తయారీ పద్దతులు, వివిధ రకాలైన వెల్డింగ్ పద్దతులు, నాణ్యత ప్రమాణాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.
ఈ సందర్శనకు ఫ్యాక్టరీ మేనేజర్ టి. రాజ మహేందర్, అడ్మిన్ హెడ్ సాయిబాబా సమన్వయం చేశారు. ఈ సందర్శనలో అధ్యాపకులు జి. అరుణ్ రెడ్డి, కె. సందీప్ కుమార్, యం. మహేష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం కల్పించిన డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్, అసోసియేట్ డీన్ మెకానికల్ విభాగ అధిపతి డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, అనురాగ్ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్, కీర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ కు విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు.






