13-12-2025 07:13:21 PM
తానూరు (విజయక్రాంతి): మండలంలోని ఝరి(b) గ్రామానికి చెందిన మాధవ్ రావు పాటిల్ అనే వ్యక్తి ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ శనివారం పరామర్శించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈయన వెంట కార్యకర్తలు ఉన్నారు.