13 May, 2026 | 3:47 PM

నేడు 60 బొగ్గు గనుల వేలం!

21-06-2024 01:41 AM

హాజరుకానున్న మంత్రులు కిషన్‌రెడ్డి, భట్టి

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు గనుల వేలం జరగనుంది. హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్‌లో హర్రాజ్ జరగనుంది. చీఫ్ గెస్ట్‌గా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. గనుల శాఖ సహాయ మంత్రి సతీష్  చంద్ర దూబెతో పాటు కోల్ మినిస్ట్రీ సెక్రటరీ అమ్రిత్‌లాల్ మీన పాల్గొనున్నారు. ఈ వేలం జాబితాలో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని కూడా ఉంది.