17 June, 2026 | 3:38 AM

18న పట్టుబడిన వాహనాలకు వేలం

17-06-2026 02:22 AM

మంచిర్యాల టౌన్, జూన్ 16 : మంచిర్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 18న వేలం వేయనున్నట్లు మంచిర్యాల ఎక్సైజ్ సీఐ గురవయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో పట్టుబడిన వాహనాల వేలం పాట ఉదయం 10.30 నిర్వహించబడునన్నారు. ఆసక్తి గలవారు 50 శాతం ఈఎండిని చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చునని, మరిన్ని వివరాలకు మంచిర్యాల ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.