100 కోట్ల క్లబ్‌లోకి లెనిన్
01-08-2026 01:58 AM
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.
ఈ మూవీ జూలై 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కింది. తొలిరోజు నుంచే రికార్డుల్ని సృష్టించడం ఆరంభిచిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఇప్పటివరకు వంద కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.






