1 August, 2026 | 2:35 AM

గెలిచేది మంచి విలనా.. చెడ్డ హీరోనా?

01-08-2026 02:00 AM

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కు సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కు దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహ న్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ వాయిస్‌తో టీజర్ ప్రారంభమైంది.

‘ఇద్దరు గూఢచారులు.. ఒకడు తండ్రి, ఒకడు కొడుకు... వాళ్ల టార్గెట్ నేనే. ఇప్పుడు గెలవబోయేది మంచి విలనా... చెడ్డ హీరోనా? అంటూ ఎస్‌జే సూర్య చెప్పే డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఆయన పాత్ర చుట్టూనే కథలో కాన్‌ఫ్లిక్ట్ ఉండబోతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక కార్తి డబుల్ రోల్‌లో అదరగొట్టారు. టీజర్‌లోని ఇంటెన్స్ యాక్షన్, హై వోల్టేజ్ స్పై డ్రామా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్; డీవోపీ: జార్జ్ సీ విలియమ్స్; ఎడిటర్: విజయ్ వేలుకుట్టి; ఆర్ట్: మాధవన్, శేఖర్.