26 July, 2026 | 2:15 AM

ప్రేక్షకాదరణే గొప్ప ప్రోత్సాహం

26-07-2026 12:00 AM

పవన్ మహావీర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, శైలజరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి‘. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహి స్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.  మేకర్స్   ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకులు సీ రాంప్రసాద్, శివనాగు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు పవన్ మహావీర్ మాట్లాడుతూ.. “డాక్టర్‌గా వైద్యం.. హీరోగా వినోదం అందించాలనే తన సంకల్పం కార్యరూపం దాల్చుతుండటం ఆనందంగా ఉంది” అన్నారు. దర్శకుడు శివాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతా” అని తెలిపారు. ‘ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం సాంకేతిక నిపుణులకు, నటీనటుల సహకారమేన’ని నిర్మాత శైలజరెడ్డి అన్నారు.