‘మారెమ్మ’ వచ్చేది అప్పుడే
రవితేజ సోదరుడైన రఘు కుమారుడు మాధవ్ ‘మారెమ్మ’తో హీరోగా పరిచయమవు తున్నారు. ఇదే చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. మోక్ష ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మయూర్‌రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపా బాలు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్‌రెడ్డి, వీఎస్ రూపాలక్ష్మిముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను బోనాల పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ గతంలో వెల్లడించారు. ఈ మేరకు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నామని ప్రకటించారు.
కొత్త పోస్టర్‌లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి; సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి; సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్; యాక్షన్: మాడిగొండ నటరాజ్; ఎడిటర్: దేవ్ రాథోడ్; ఆర్ట్: రాజ్ కుమార్ మురుగేషన్.






