11-11-2025 12:44:14 AM
-పరువు తీస్తున్న వారిని తొలగించాలి
-మరోసారి గుప్పుమన్న విభేదాలు
-ఇందిరమ్మ లబ్దిదారుల జాబితాను ప్రకటించాలి
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 10: బెల్లంప ల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసమ్మతి గళం చర్చనీయాంశంగా మారింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పైరవీ కొమురక్క ఆడి యో, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నెలకొన్న అసంతృప్తి కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత కలహాల కాపురంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పరంపరలో రూ. 3 లక్షలు ఇస్తే ఇల్లు ఇప్పిస్తామని కాంగ్రెస్ యువ నేత ఒకరు కొమురక్కతో చేసిన సంభాషణ ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఇది కాస్త మీడియాకు చేరడంతో డబుల్ బెడ్ రూం ఇండ్లు డబ్బులకు అమ్ముకునే వ్యవహారం బద్దలైంది. మీడియాలో ప్రచురితం కావడంతో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. సంచలనంగా మారిన కొమురక్క ఆడియోతో కాంగ్రెస్ పరువు మరోసారి రచ్చకెక్కింది.
డబుల్ బెడ్ రూం పంపిణీకీ రెవెన్యూ అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని నాలుగు డబ్బులు కూడా పెట్టుకుందామనే కక్కుర్తిలో కాంగ్రెస్ యువనేత వ్యూహం అనూహ్యంగా బట్టబయలు కావడం సంచలనం రేకెత్తించింది. సదరు యువనేత కాంగ్రెస్‌కు చెందిన ఓ మహిళతో పైరవీ కోసం జరిపిన సంభాషణ ఆడియోపై ‘విజయక్రాంతి’ దిన పత్రికలో ‘ఎక్కడ చూసి నా కొమురక్క చర్చే...’ అనే శీర్షికతో వచ్చిన కథనం రాగా డబుల్ బెడ్ రూం పంపకాల వ్యవహారంలో కాంగ్రెస్‌లోని ఓ వర్గం అవినీతి కోణం వెలుగులోకి రావడం ఆ పార్టీలో విభేదాలకు మరోసారి ఆజ్యం పోసినట్టయిం ది. పట్టణ కాంగ్రెస్‌లో ఇప్పటికే కలహాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి.
కొమురక్క అనే మహిళతో సంభాషణ చేసిన కాం గ్రెస్ యువనేత ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచర వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో విభేదాలు ముదిరీపాకానపడ్డాయి. కాగా ఈ వ్యవహారంపై ప్రత్యర్ధి వర్గం నిప్పులు చెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారని వాపోతున్నారు. ఇందుకు కారణమైన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏకంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను డిమాం డ్ చేసే పరిస్థితికి విభేదాలు చేరుకున్నాయి. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు తన అనుచర వర్గం తో సమావేశమయ్యారు.
అర్హులకు ఉచితం గా ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్లను అమ్మడానికి స్కెచ్ వేసిన సదరు యువ కాంగ్రెస్ నేతతో పాటు అతనికీ అండదండలుగా ఉన్న ప్రధాన నాయకుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ సమావేశంలో సూరిబాబు డిమాండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేను కోరడం సంచలనం గా మారింది. ఇప్పటికే ఇద్దరమ్మ ఇళ్ల ఎంపి క, పొజిషన్ సర్టిఫికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే వినోద్ కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు తన దిక్కార గళాన్ని వినిపించిన సంగతి తెలిసిందే.
వలసొచ్చిన వారిని సస్పెండ్ చేయాలి
మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు తన వర్గంతో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే తీరుపై ఆయన ఆగ్రహం వ్య క్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోనీ అసమ్మతీ బట్టబయలైంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మడానికి స్కెచ్ వేసిన కాంగ్రెస్ యువనేతపై చర్యలకు డిమాండ్ చేశారు. ఇది ఎమ్మెల్యే అనుచరులను లక్ష్యంగా జరుగుతోన్న దాడిగానే కనిపిస్తుంది. బెల్లంపల్లి పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టును ప్రకటించాలని కోరారు. ఏ వార్డుకు కు ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయో డిమాండ్ చేయ డం ప్రత్యర్థులను దోషులుగా నిలబెట్టే వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. వలసోచ్చిన కొందరి వల్ల కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలవుతుందని సూరిబాబు ఆ సమావేశం లో వాపోయారు.
కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్న వలసొచ్చిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరడం చూస్తే విభేదాలు తారస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా మాట్లాడుతున్నందుకు తమను పార్టీ నుంచి తొలగించిన పర్వాలేదనీ, కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధమన్న అసంతృప్తివాదుల గళం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇద్దరమ్మ ఇల్లు, రోడ్డు విస్తరణ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డబ్బులు తీసుకున్న వారి జాబితా తమ వద్ద ఉందని ప్రకటించడంతో కాంగ్రెస్ లోని కొందరీ అవినీతినీ తెరకెక్కించినట్లైంది. అంతేకాకుండా ఇందిరమ్మ లబ్ధి దారుల లిస్టును ప్రకటించకపోతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కూడా సూరిబాబు హెచ్చరిక కలకలం రేపింది. సూరిబాబు అసమ్మతీ తీరు, కాంగ్రెస్ శ్రేణు ల్లో తీవ్ర ఉత్కంఠతకు తెరతీసింది. కాంగ్రెస్ లో నెలకొన్న పరిణామాలు, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పని తీరుపై సూరిబాబు స్పందించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మరి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.