calender_icon.png 11 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్లకు 300 కోట్ల పంపిణీ?

11-11-2025 12:45:49 AM

  1. అంతా గత వారం రోజుల్లోనే..
  2. డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా చెల్లింపులు!
  3. కార్యకర్తల ఖాతాల ద్వారా రోజుకు రూ.లక్ష 
  4. పరిమితిని దాటకుండా చెల్లించిన పార్టీలు? 
  5. జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల నిబంధనలకు తూట్లు
  6. నేరస్తులను శిక్షించాలని పౌరుల డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): హైదరాబాద్ నగరంలోని అత్యంత సంపన్న నియోజకవర్గమైన జూబ్లీహిల్స్‌లో ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగినట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు గత వారం రోజుల వ్యవధిలోనే రూ.300 కోట్లకు పైగా నగదు ఓటర్లకు చేరినట్టు సమాచారం. ఈ నగదు చెల్లింపులు డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా జరిగిన ట్లు తెలుస్తోంది.

గూగుల్ పే, ఫోన్‌పే, పేటీ ఎం, ఫ్యాంపే వంటి యాప్‌ల ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు సమాచారం. పార్టీలు తమ కార్యకర్తల ఖాతాల ద్వారా రోజుకు రూ.లక్ష బదిలీ పరిమితిని దాటకుండా, వందలాది ఖాతాల మార్గంగా ఈ చెల్లింపులను విభజించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెపుతున్నా యి.‘ఒక కార్యకర్త మొబైల్ నుంచే పలు ఖాతా ల ద్వారా చిన్నచిన్న మొత్తాలు పంపేవారు. వాటిని ‘ఫెస్టివల్ గిఫ్ట్’ లేదా ‘కమ్యూనిటీ ఎయిడ్’గా చూపించారు’ అని ఒక వ్యక్తి వెల్లడించారు. 

నేరస్తులకు పడాల్సిన శిక్షలు..

ఇలా నగదు పంపిణీ చేయడం ప్రజా ప్రతినిధుల చట్టం, 1951లోని సెక్షన్ 123(1) ప్రకా రం లంచంగా పరిగణిస్తారు. దీనికి అనుగుణంగా నేరస్తులకు ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు వేస్తారు. అలాగే ఒక సంవత్స రం వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కూడా ఇలాంటి ఆఫర్లు, నగదు పంపిణీలు కఠినంగా నిషేధించారు. 2024 ఫిబ్రవరిలో ఈసీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్‌లపై నిఘా పెంచుతూ, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలకు(ఎస్‌ఎల్‌బీసీ) యూపీఐ మార్పిడి లావాదేవీలను పర్యవేక్షించాలని ఆదేశించింది. 

పౌరుల నుంచి ఆగ్రహం

‘ఇది ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే సంస్థాగత అవినీతి’ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ త్రిలోచన్ శాస్త్రి తీవ్రంగా స్పందించారు. ‘ఎన్నికల కమిషన్ యాప్ కంపెనీల నుండి ట్రాన్సాక్షన్ లాగ్‌లను స్వాధీనం చేసుకోవాలి. బ్లాక్‌చైన్ స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ జరిపి, నేరస్థులను బహిర్గతం చేయాలి. ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎందు కు ఇచ్చారు అన్నది ప్రజలకు తెలియాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం, 2024 ఎన్నికల్లో రూ. 1,500 కోట్లకు పైగా డిజిటల్ ప్రకటనల ద్వారా గోప్యంగా ఖర్చు అయ్యింది. ఇది ఫిన్‌టెక్ రంగంలోని భద్రతా లోపాలను సూచిస్తోందని పేర్కొంది.