9 April, 2026 | 7:02 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌

09-04-2026 05:29 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల 108 అంబులెన్స్ సేవలను జీవీకే ఈఎంఆర్ఐ (GVK EMRI) గ్రీన్ హెల్త్ సర్వీస్ హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ఆడిట్ సూపర్వైజర్ కిషోర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న మెడికల్ పరికరాల పనితీరు, మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, నిర్వహణ రికార్డులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అత్యవసర కేసుల నిర్వహణ విధానం, సేవల సమయపాలన, సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు.

మందుల నిర్వహణ సక్రమంగా ఉండటం, మెడికల్ పరికరాలు సమర్థంగా పనిచేయడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది విధి నిర్వహణను మెచ్చుకుని, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 108 మేనేజర్ మనోహర్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) రాము, వాహన చోదకుడు పైలెట్ లాల్‌సింగ్ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.