calender_icon.png 4 February, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యపై కోపంతో.. అత్త, బావమరిదిపై కత్తితో దాడి

04-02-2026 12:33:00 AM

హనుమకొండ, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హన్మకొండలోని న్యూశాయంపేటలో ఘోర ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కుడికాల అఖిల్ భార్య సజ్వితపై కోపంతో అత్త సునీత, బావమరిది గుం డు రామన్ పై దాడి చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుడికాల అఖిల్ మూడు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన తన టెన్త్ క్లాస్ మెంట్ సజ్విత ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

గత రెండు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండటంతో, సజ్విత భర్తకు దూరంగా ఉంటూ, హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అత్తవాళ్ల ఇంట్లో ఉన్న భార్యపై కోపంతో కత్తితో దాడిచేసేందుకు వెళ్ళిన అఖిల్ ను అడ్డుకోయిన అత్త సునీత ,బావమరిది గుండు రామన్ పై కత్తితో దాడి చేశాడు. దాడిలో అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. గమనించి న స్థానికులు క్షత గాత్రులను రోహిణి హాస్పిటల్ కి తరలించారు. సుబేదారి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.