రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
ఇద్దరు పరిస్థితి విషమం
మర్రిగూడ,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రా0రెడ్డిపల్లి గ్రామ శివారులో రోడ్డుపై ఎదురెదురుగా టాటా ఏసీ రెండు మోటారు బైకులు ఢీకొనడంతో మోటారు బైకులపై ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైకులపై ఆరు నెలల ఇద్దరు చిన్నారులు కూడా తలకు గాయాలయ్యాయి పల్సర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు నల్లగొండ జిల్లా కనగల్ మండలం బోడమర్లపల్లి గ్రామానికి చెందిన మోర శివ రేణుక తో సహా ఆరు నెలల చిన్న పాప కు గాయాలయ్యాయి స్థానికులు క్షతగాత్రులను మర్రిగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను నిర్వహించారు.
ఇందులో శివకు రేణుకకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో అంబులెన్స్ లో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు రెండవ బైక్ పై మర్రిగూడ మండలం సారంపేట గ్రామానికి చెందిన ఈద స్వామి స్వప్న చిన్నారి పాప కూడా స్వల్ప గాయాలు తగలడంతో మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు స్థానికులు సమాచారం అందడంతో మర్రిగూడ పోలీసులు సంఘటన స్థలాలకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు






